2002 గుజరాత్ అల్లర్ల కేసులో నాటి సీఎం, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 14 కు వాయిదా వేసింది. పిటిషనర్ జకియా జప్రి తరపున ఆమె లాయర్ విచారణ వాయిదా కోరారు. హోలీ పండుగ తర్వాత విచారణ చేపట్టాలని అభ్యర్ధించారు.పిటిషనర్ జకియా జఫ్రీ తరపు లాయర్ అపర్ణా భట్ విషయం వివాదస్పదమైనదని కోర్టుకు చెప్పారు. దీనికి బెంచ్ స్పందిస్తూ ” విచారణ చాలా సార్లు వాయిదా పడింది… ఏదో ఒక రోజు విచారణ జరగాల్సిందే…ఒక తేదీ తీసుకొని ఆ రోజు కచ్చితంగా రండి” అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ లో ఫిబ్రవరి 27 2002 నుంచి మే 2002 వరకు పెద్ద కుట్ర జరిగినందున నోటీసులివ్వాల్సిందిగా అంతకు ముందు కోర్టును కోరింది.
28 ఫిబ్రవరి 2002 లో గుల్బర్గ్ సొసైటీలో జరిగిన అల్లర్లలో 68 మంది హత్యకు గురయ్యారు. వారిలో పిటిషనర్ జకియా జఫ్రీ భర్త ఇషాన్ జప్రీ ఒకరు. గోద్రా రైల్వే స్టేషన్ లో సబర్మతి ఎక్స్ ప్రెస్ ను తగులబెట్టిన ఘటనలో 59 మంది సజీవ దహహనమయ్యారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు గుజరాత్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లపై విచారణ జరిపిన సిట్ 2012 ఫిబ్రవరి 8 న నాటి ముఖ్యమంత్రి నరేద్రమోదీ, ప్రభుత్వ అధికారులతో పాటు మరో 63 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. వాళ్లు నేరం చేసినట్టుగా విచారించదగ్గ ఆధారాలు లేవని నివేదికలో పేర్కొంది. సిట్ నివేదికపై గుజరాత్ హైకోర్టులో జకియా జప్రీ వేసిన పిటిషన్ ను కోర్టు తిరిస్కరించింది. దీంతో పిటిషనర్ సుప్రీంకోర్టు నాశ్రయించారు.