గుజరాత్‌లో భూకంపం వచ్చింది. సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున స్వల్పం భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఉదయం 12.52 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు ఇనిస్టిట్యూట్ ఫర్ సిస్మలాజికల్ రీసెర్చ్ వెల్లడించింది.
సూరత్‌కు పశ్చిమ నైరుతి తీరంలో 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు అధికారులు వెల్లడించారు. హజీర జిల్లాకు అత్యంత సమీపంలో అరేబియా సముద్రంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదన్నారు.
భూమిలో 5.2 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి చెప్పారు. రాష్ట్రంలో 1819, 1845, 1847,1848, 1864, 1903, 1938, 1956, 2001లో అతిపెద్ద భూకంపాలు సంభవించాయని గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
2001లో కచ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం రెండు దశాబ్దాల్లోనే పెద్దది కావడం గమనార్హం. కచ్ భూకంపం దేశంలో అతి పెద్ద మూడవ భూకంపం కావడం గమనార్హం. విధ్వంసం పరంగా చూస్తే దేశంలో రెండో అతిపెద్దది కచ్ భూకంపం. ఇందులో 13,800 మంది మృతి చెందారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.