గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు సమర్పించారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలున్న సమయంలో సీఎం రాజీనామా కీలకంగా మారింది. అయితే, పార్టీ నిర్ణయం ప్రకారం ఆయన రాజీనామా చేశారా…? మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.
2016 ఆగస్టు 7న విజయ్ రూపానీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఎన్నికలకు యువ నాయకత్వాన్ని సిద్ధం చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ అగ్రనాయకత్వం రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈసారి పటేల్ సామాజికవర్గానికి సీఎం కుర్చీ అప్పజెప్పే అవకాశం ఉంది.
కొద్దిరోజుల క్రితమే కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప, ఉత్తరాఖండ్ లో సీఎంగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ తమ పదవికి రాజీనామా చేశారు.