అగ్రదేశాధినేతలు మన దేశానికి వచ్చినప్పుడు వారు పర్యటించే ప్రాంతాలను సుందరీకరించడం అసాధారణమేమి కాదు..కానీ గుజరాత్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం ఒకడుగు ముందుకేసి చర్యలు చేపడుతోంది.
అగ్రరాజ్య అధ్యక్షుడు…ప్రపంచ దేశాలకే పెద్దన్నగా పిలవబడే అమెరికా అధ్యక్షుడు భారత దేశానికి వస్తే…ఇక్కడి పేదరికం చూసి చీత్కరించుకుంటాడనుకున్నారో…లేక భారతదేశ బండారం బయటపడుతుందనుకున్నారో తెలియదు కానీ గుజరాత్ మున్సిపల్ అధికారులు ట్రంప్ ప్రయాణించే మార్గంలో మురికివాడలు, పేదరికం కనిపించకుండా మూసేస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఫోర్ట్ నుంచి గాంధీనగర్ వెళ్లే అర కిలో మీటర్ దారిలో ఉండే మురికివాడలు కనిపించకుండా చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇందిరా బ్రిడ్జ్ వరకు రోడ్డు పక్కన 7 పీట్ల రోడ్డు కడుతున్నారు. ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలు ఈ మార్గంలోనే రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ఇరువురు నేతలు పాల్గొంటారు.
దేవ్ సరన్, సరనియావాస్ మురికి వాడల్లోని 500 కచ్చా ఇళ్లను కనిపించకుండా చేయడం కోసమే గోడ కడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మురికివాడల్లో దాదాపు 2,500 జనాభా వుంటుంది. మురికివాడలను మూసేస్తు గోడ పూర్తయ్యాక అక్కడన్ని సుందరీకరణ కోసం కర్జూరపు చెట్లను నాటుతారు. కొన్నేళ్లుగా రిపేర్ కు నోచుకొని రోడ్లను ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. లైట్లు అమర్చి అందంగా తయారు చేస్తున్నారు. దాదాపు 16 రోడ్లు ట్రంప్ రాకతో మంచిగవుతున్నాయి.
ఇదంతా బాగానే ఉంది. మరి వీటికయ్యే ఖర్చెంతో తెలుసా..? దాదాపు రూ.50 కోట్లు.
2017 లో ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ కు వచ్చింది గుర్తుందా..? అప్పట్లో హైదరాబాద్ రోడ్ల మీదున్న బిచ్చగాళ్లందరిని పోలీసులు పట్టుకొని పోయి ఎక్కడో నిర్బంధించారు. ఇదంతా మన దేశంలోని పేదరికం కనిపించకుండా చేయడం కోసమట.