ఫోక్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి సింగర్ ఓ ఫోక్ సాంగ్ అందుకుంటే శ్రోతలు ఉర్రూతలూగిపోతారు. కొన్ని సార్లు శ్రోతలు ఆ పాటకు అనుగుణంగా పైకి లేచి స్టెప్పులు కూడా వేస్తారు. అబ్బా ఏం పాడిండు పాట… ఆయనకు ఏం ఇచ్చినా తక్కువే అని అనిపిస్తుంది.
అలాంటి అనుభవమే గుజరాత్ ప్రజలకు ఎదురైంది. వల్సాద్‌లో అగ్నివీర్ గో సేవా దళ్ ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించింది. అక్కడికి జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్విని సేవాదళ్ ఆహ్వానించింది. ఆ కార్యక్రమంలో ఆయన ఓ మంచి ఫోక్ సాంగ్ పాడారు.
ఆ పాటకు అక్కడ వున్న సంగీత ప్రియులు మైమరిచి పోయారు. ఆ పాటకు కొందరు చిన్న పాటి స్టెప్పులేశారు. మరి కొందరైతే పరవశించి పోయి ఆయనపై నోట్ల వర్షం కురిపించారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను వేదికపైకి వెదజల్లారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలో వేదికపై కూర్చుని సింగర్ కీర్తిదాన్ పాట పాడుతున్నారు. ఆ పక్కనే అభిమానులు ఆయనపై నోట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో స్టేజి మొత్తం నోట్లతో నిండి పోవడం వీడియోలో కనిపిస్తోంది.