యువ ర్యాపర్ ధర్మేశ్ ఫార్మర్(24) సోమవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్వదేశీ లేబుల్ ఆజాదీ రికార్డ్స్, మేనేజ్ మెంట్ కంపెనీ 4/4 ఎంటర్ టైన్ మెంట్ అతని మరణ వార్తను ధృవీకరించాయి.
ధర్మేశ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రణ్ వీర్ సింగ్-సిద్దాంత్ చతుర్వేది నటించిన గల్లీబాయ్ లోని ఇండియా 91 పాటను దర్మేశ్ ర్యాప్ చేశాడు. ఇది అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
ఈ యువ ర్యాపర్ మృతిపై ప్రముఖ నటులు స్పందించారు. ధర్మేశ్ ఫోటోను రణవీర్ సింగ్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ పెట్టాడు. అదే సమయంలో ధర్మేశ్ తో తన సంభాషణల స్క్రీన్ షాట్ ను ఇన్ స్టాలో పంచుకున్నాడు సిద్దాంత్.
Advertisements
అందులో ఒకరి ప్రదర్శనను మరొకరు ప్రశంసించుకున్నారు. ‘రిప్ బాయ్’ అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు సిద్దాంత్.