రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద శనివారం అర్థరాత్రి కాల్పుల ఘటన అలజడి సృష్టించింది. మెదక్ నుంచి కొచ్చికి ఐరన్‌లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్ పై స్విఫ్ట్ కారులో వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు.
గురి తప్పడంతో లారీ డ్రైవర్,క్లీనర్ కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. దీంతో లారీ అద్దాలు బాగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. లారీలోని ఐరన్‌ను ఎత్తుకెళ్లేందుకే దుండగులు కాల్పులు జరిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్న అధికారులు. పాత పరిచయాల నేపథ్యంలో ఏమైనా కాల్పులు జరిగాయా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు.
దారి దోపిడీ దొంగల పనా లేదా మరిదేని కోసమైనా ఈ కాల్పులు చేశారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వారి కోసం మూడు స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేసి విచారణ , చేపట్టిన పోలీసులు.