కృష్ణాజిల్లా జిల్లా కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్ అవడం కలకలం రేగింది. ట్రెజరీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు చేతిలో ఉన్న గన్ ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.