క్రికెట్ మ్యాచ్‌లు అన్నాక అప్పుడప్పుడు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకోవడం మామూలే. అంపైర్లు తీసుకునే నిర్ణయాలు, క్రీడాకారుల ప్రవర్తన తదితర అనేక విషయాలు చర్చనీయాంశం అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంక, వెస్టిండీస్‌ల మధ్య ఆంటిగ్వాలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లోనూ ఓ సంఘటన వివాదాస్పదంగా మారింది. శ్రీలంక ప్లేయర్ దనుష్క గుణతిలక ఔట్ అయిన విధానం వివాదాస్పదమవుతోంది.
శ్రీలంక ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో గుణ తిలకకు విండీస్ కెప్టెన్ పొల్లార్డ్ బంతి వేయగా దాన్ని అతను డిఫెన్స్ ఆడాడు. అయితే రన్‌కు యత్నించి కొద్దిగా ముందుకు వచ్చాడు. దీంతో విండీస్ జట్టు ఫీల్డర్లు బంతిని అందుకుని గుణతిలకను రనౌట్ చేయబోయారు. అయితే గుణ తిలక బంతికి అడ్డుగా నిలబడ్డాడు. కానీ ఆ విషయం అతను వెంటనే గ్రహించి బంతిని దాటి వెనక్కి వచ్చేశాడు. ఈ క్రమంలో గుణ తిలక అప్పటికే క్రీజులోకి వెళ్లిపోయాడు. దీంతో పొల్లార్డ్‌కు గుణతిలకను రనౌట్ చేసేందుకు అవకాశం లభించలేదు.
This rare dismissal has sparked outrage. Surely it wasn't deliberate! 😳😳
MORE: https://t.co/roxIfLJm8E
🎥@windiescricket pic.twitter.com/CRcYmk2l08
— Fox Cricket (@FoxCricket) March 11, 2021
అయితే దీనిపై పొల్లార్డ్ ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఈ క్రమంలో బంతిని రీప్లేలో చూసిన థర్డ్ అంపైర్ వెంటనే గుణ తిలకను ఔట్‌గా ప్రకటించాడు. అసలు థర్డ్ అంపైర్ అందుకు అసలు ఏమాత్రం సమయాన్ని వృథా చేయలేదు. వెంటనే గుణ తిలకను ఔట్‌గా ప్రకటించాడు. అయితే నిజానికి రీప్లేల్లో గుణతిలక విండీస్ ఫీల్డర్లను కావాలని అడ్డుకున్నట్లు స్పష్టంగా కనిపించలేదు. నిజానికి అతను బంతి వెనక్కి వచ్చేశాడు. అయినప్పటికీ గుణతిలక తమ ఫీల్డర్లను అడ్డుకున్నాడని పొల్లార్డ్ అప్పీల్ చేశాడు. దీంతో గుణతిలక ఫీల్డర్లను అడ్డుకున్నందుకు ఔట్ అయ్యాడు. ఆ మేరకు థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
క్రికెట్ మ్యాచ్‌లలో చాలా రకాలుగా బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతారు. కానీ ఇది అత్యంత అరుదుగా సంభవించే ఔట్. అందువల్లే వివాదాస్పదమవుతోంది. ఇక నెటిజన్లు కూడా గుణతిలకకు మద్దతిస్తున్నారు. అతను కావాలని అడ్డుకోలేదని, అయినప్పటికీ అతన్ని వెంటనే, ఏమాత్రం ఆలోచించకుండా ఔట్ అని ప్రకటించడం అన్యాయమని.. నెటిజన్లు అంటున్నారు. చాలా మంది ఈ అంశంపై స్పందిస్తున్నారు.