రుద్రమ దేవి తర్వాత దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. మొదట హిరణ్యకశ్యప సినిమా ప్రకటించినప్పటికీ దానికన్నా ముందు శాకుంతలం సినిమా ప్రారంభిస్తున్నారు గుణశేఖర్. ఇక ఈ సినిమాలో సమంత శకుంతల క్యారెక్టర్ చేయనున్నారు. మొదట ఆ పాత్ర లో పూజ హెగ్డే నటిస్తుందని అందరూ అనుకున్నప్పటికీ గుణశేఖర్ మాత్రం సమంత వైపు ఫోకస్ పెట్టాడు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక మామూలుగా గుణశేఖర్ దర్శకత్వంలో సినిమా అంటే భారీ సెట్టింగులకు పెట్టింది పేరు.
ప్రస్తుతం శాకుంతలం మూవీ సెట్ ను చిత్ర యూనిట్ పరిశీలించింది. శాకుంతలం సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరిగేలా గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు. అదీకాక పౌరాణికం కావడంతో సెట్టింగ్ లపైనే ఎక్కువ దృష్టి సారించాడు గుణశేఖర్.