ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో బయోపిక్ ల హవా కొనసాగుతూనే ఉంది. అయితే అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో మన దేశానికి చెందిన తొలి మహిళా ఐ.ఎ.యఫ్ ఫైలట్ ఆఫీసర్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా గుంజన్ సక్సేనా. కార్గిల్ యుద్ధంలో ఆమె అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డునిచ్చి ఆమెను సత్కరించింది.
తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. గుంజన్ సక్సేనా ఫైలట్ ఎందుకు కావాలనుకుంది, ఎలా అయింది, దేశానికి చేసిన సేవలు ఏంటి అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.కాగా కరోనా ప్రభావంతో థియేటర్స్ లేకపోవటంతో నెట్ ఫ్లిక్స్ లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 12 న ఈ సినిమా రిలీజ్ కానుంది.