డైరెక్టర్ గుణశేఖర్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మరచిపోయిన ప్రేమ…మరచిపోలేని ప్రేమ కథ అంటూ మోషన్ పోస్టర్ ద్వారా ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరోవైపు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
కాగా ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల 20నుంచి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సమంత ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి 11 ఏళ్ళు అవుతున్న సందర్భంగా గుణ శేఖర్ టీమ్ ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపింది. సమంత తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుతున్నట్టు తెలిపింది. 2010 ఫిబ్రవరి 26న సమంత మొదటి చిత్రం ఏ మాయ చేసావే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.