సరిహద్దు ప్రయాణికుల ఇబ్బందులపై గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు బృందాలను పంపుతున్నామని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో క్వారెంటైన్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి నల్గొండ అధికారులకు కోరుతామని తెలిపారు. క్వారెంటైన్ సమయం అయిన తరువాతనే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని అంగీకరించిన వారికి మాత్రమే రాష్ట్రములో కి అనుమతిస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం వారిని వెంటనే ఊర్లోకి అనుమతించలేమని తేల్చి చెప్పారు.
తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతంలో వేలాది మంది ప్రయాణికులు నిలిచి పోయిన సంగతి తెలిసిందే. మరో వైపు గుంటూరు రేంజ్ ఐజి ప్రభాకర్ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతంలో ఉన్నవారితో అందరితోనూ మాట్లాడుతున్నాము. ముందస్తు సమాచారం లేకుండా హైదరాబాద్ నుంచి రావటం వల్లే సమస్యలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతం ఆగిన వారు సంయమనం తో మాట్లాడాలని పోలీసులకు సూచించారు. రెవిన్యూ అధికార్లతో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.