రాజధాని తరలింపు ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన రామాయణపు. లక్ష్మయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారనే మనస్తాపంతో లక్ష్మయ్య మనస్థాపానికి గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చేపడుతున్న ఆందోళనలో రామాయణపు.లక్ష్మయ్య చురుకుగా పాల్గొనేవాడని తెలిపారు.