నేను టీడీపీలో ఉన్నప్పటి నుంచే గవర్నర్ వ్యవస్థలకు వ్యతిరేకమని చెప్పారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తాజాగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, శాసన వ్యవస్థ ఒకదానితో ఒకటి కలిసి పని చేయాల్సి ఉంటుందని, దీంట్లో ఎవరి విజయం ఉండదన్నారు.
గవర్నర్ ప్రసంగం అంతా సాఫీగా జరగాలని అనుకుంటున్నామన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ఉన్నది ఉన్నట్టు చెబితే చాలని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి మార్చాలన్న 20 మంది సిట్టింగ్ లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంత మంది ఉన్నారో నాకేం తెలుసు.. ఆయన్నే అడగండన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. వక్రబుద్ధితో ఆలోచన చేస్తే వాళ్లు.. మంచి బుద్ధి కలగాలన్నారు. గాంధీజీ లేని లోటు కనిపిస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగానికి ఆటంకాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి.