
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత..రెండోసారి మండలి ఛైర్మన్ గా ఎన్నికైన గుత్తాకు మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. గుత్తాను చైర్ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి గుత్తా సుఖేందర్‌రెడ్డి అని మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు.
Advertisements
అనేక పదవులను అలంకరించినా ఆయన సామాన్య వ్యక్తిగానే ఉన్నారని ప్రశంసించారు. మండలి ఛైర్మన్ గా గుత్తా విజయవంతమయ్యారని పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఙతలు తెలుపుకుంటున్నానని గుత్తా పేర్కొన్నారు.