హైదరాబాద్: తెలంగాణా శాసనమండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ వెంట రాగా, మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సభ్యులు కొత్త చైర్మన్‌కు అభినందనలు తెలిపారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయాల్లో కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. నల్గొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌గా, మదర్ డైరీ చైర్మన్‌గా, ఎంపీగా విశిష్ట సేవలు అందించారు.