చంద్రబాబు తనకి తానుగా బీజేపీ పార్టీకి దగ్గర అవుతున్నారన్నారు రాజ్యసభ సభ్యుడు జీవియల్. బీజేపీలో టీడీపీని విలీనం చెయ్యాలి అనుకుంటే బీజేపీ అధిష్టానంతో నేను మాట్లాడుతా అని ఎగతాళి చేశారు. దేశంలో ఏ నాయకుడు తిట్టని విధంగా చంద్రబాబు మోడీని తిట్టాడు. ఐదేళ్లు రాజధానిలో గ్రాఫిక్స్ చూపించారు… ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు, చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు అస్సలు రాజధాని నిర్మాణం చేసి ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదు.
రాజధానిని రాజకీయా అవసరాలకోసం కాకుండా, ప్రజావసరాలకు వాడితే బాగుంటుంది. ప్రజా అవసరాల కోసం రాజధానిని మార్చుతాము అంటే తాము అడ్డురామని తెలిపారు.రాష్ట్రంలో అవినీతి ఎవరు చేసినా సహించేది లేదని మోడీ చెప్పారన్నారు. పోలవరం లో అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవాళ్లు ఎవరైనా సరే శిక్షించబడతారన్నారు.
రుణాలు ఎగవేత విషయం లో ఎవ్వరు తప్పించుకోలేరు. దీనికి సుజనా అతీతుడు కాదు. సుజనా చౌదరి బీజేపీ లో ఉన్నంత మాత్రాన రుణాలు ఎగ్గొట్టలేరని తెలిపారు. అందరిలానే సుజనా కూడా బ్యాంకులకు రుణాలు కట్టాల్సిందే అని చెప్పారు.