ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. కానీ.. వసతులు, సదుపాయాలు లేకుండా ఏర్పాటు చేస్తే ఎలాగని నిలదీశారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయకూడదని హితవు పలికారు.
ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తాము 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొన్నామని గుర్తుచేశారు. ఈ విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జిల్లాల పరిస్థితి అయోమయంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
నిధులు లేకుండా కొత్త జిల్లాల్లో విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు జీవీఎల్. జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ పెంచాలని అన్నారు.
అమరావతికి నిధులు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.