బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావ్ కు ఆవు దాడి నుంచి తృటిలో ప్రమాదం తప్పింది. కట్టేసి ఉన్న ఆవుని జీవీఎల్ తాకిన క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆవు వెనుక కాలితో ఆయన పై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆవు కట్టేసి ఉండడంతో జీవీఎల్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఆయన చుట్టూ జనం ఉండడంతోనే ఆవు కంగారు పడి ఉంటుందని, ఈ క్రమంలోనే ఆయనపై దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఇలా ఉంటే ముందు వైపు నుంచి కూడా ఆ ఆవు జీవీఎల్ పై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో సెక్యూరిటీ అలర్ట్ అయి ఆయన్ని కాపాడడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన గుంటూరు మిర్చి యార్డులో చోటుచేసుకుంది.
అయితే అంతకుముందు జీవీఎల్..వైసీపీ,టీడీపీలపై ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో వైసీపీకి బీజేపీ, జనసేనలే ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు. విశాఖలో భూములు దోపిడికి గురవుతున్నాయని అన్న.. ఆయన దీని పై చర్చించడానికి అధికార,ప్రతిపక్షాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
వైసీపీ కారణంగానే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని ఆరోపించారు జీవీఎల్. పోలవరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. వచ్చే ఏడాది నుంచి విశాఖకు 5 జీ సేవలు అందిస్తామన్నారు.