రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక సమావేశం జూలైలో జరగనున్నది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సమావేశంలో కీలక అంశాలపై ఆర్ఎస్ఎస్ నేతలు విస్తృతంగా చర్చించనున్నట్టు సమాచారం. ప్రధానంగా జ్ఞాన వాపి మసీదుపై చర్చను చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
దీంతో పాటు మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ తర్వాత బీజేపీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, తదనంతరం జరిగిన అల్లర్లపై కీలకంగా చర్చించనున్నట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి.
మే 28న ఓ టీవీ డిబెట్ సమయంలో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగాయి.