దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హ్యాకర్లు రెచ్చిపోయారు. రేజర్ పే పేమెంట్ గేట్ వేను ట్యాంపరింగ్ చేసి ఏకంగా రూ. 7.8 కోట్లను దోచుకున్నారు. ఫెయిల్ అయిన 831 ట్రాన్సక్షన్ లకు సంబంధించి భారీగా డబ్బును హ్యాకర్లు దొంగిలించినట్టు రేజర్ పే తన ఫిర్యాదులో పేర్కొంది.
హ్యాకింగ్ ఘటనపై సైబర్ క్రైమ్ విభాగానికి రేజర్‌పే లీగల్ డిస్ప్యూట్స్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ హెడ్ అభిషేక్ అభినవ్ ఆనంద్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ… 831 లావాదేవీలకు సంబంధించి కంపెనీ రూ 7.38 కోట్ల విలువ చేసే రశీదులను సరిదిద్దలేకపోయిందని తెలిపారు.
ఈ విషయమై తమ ఆథరైజేషన్, అథెంటికేషన్ భాగస్వామి ఫిసర్వ్ కంపెనీ సంప్రదించగా… సదరు లావాదేవీలు విఫలమయ్యాయని, వాటిని ఆథరైజ్ చేయలేదని తమకు తెలిపారని ఫిర్యాదుదారు వెల్లడించారు.
ఫిసర్వ్ నుంచి వచ్చిన సమాధానంతతో రేజర్ పే అంతర్గత విచారణను నిర్వహించిందని తెలిపారు. 16 మంది వ్యాపారులకు సంబంధించి మార్చి 6 నుండి మే 13 వరకు రూ.7,38,36,192 విలువగల 831 లావాదేవీలను హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించామని వెల్లడించారు. హాకర్లు అథంటికేషన్ విధానాన్ని మార్చి డబ్బును దోచుకుని ఉంటారని ఫిర్యాదు చేశారు.