భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మోడీ ప్రధానిగా ఉండి ఉంటే కర్తార్ పూర్ సాహిబ్, నాన్ కానా సాహిబ్ లు భారతదేశంలో భాగంగా ఉండి ఉండేవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఆయన…
‘ భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో మోడీ ప్రధానిగా ఉండి ఉంటే కర్తార్ పూర్, నాన్ కానా సాహిబ్ లు పాకిస్తాన్ చేతికి వెళ్లేవి కావు. అవి భారత్ లో భాగంగా ఉండేవి” అని ఆయన అన్నారు.
ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ… ‘ విభజన సమయంలో కర్తార్ పూర్ ను భారత్ లో భాగంగా చేయడంలో విఫలమై కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది. 1965,1971లో పాక్ యుద్ధ సమయంలో కర్తార్ పూర్ ను దక్కించుకునేందుకు వచ్చిన రెండో అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోలేక పోయింది” అని తెలిపారు.
ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన ఘటన కారణంగా జనవరి 5న కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించలేకపోయాము. వాటిని ఇప్పుడు బైసాఖీకి ముందే డిజిటల్‌గా ప్రారంభిస్తాము” అని తెలిపారు.
‘ ప్రధాని మోడీకి రక్షణ కల్పించడంలో సీఎం ఛన్నీ విఫలమయ్యారు. కాంగ్రెస్ నేతలు ఉద్దేశ పూర్వకంగానే ప్రధాని మోడీ ప్రయాణించే మార్గాన్ని బ్లాక్ చేశారు. పంజాబీలతో ప్రధాని మోడీ తన ఆలోచనలను పంచుకోకుండా చేసేందుకు గుండాలను కాంగ్రెస్ నేతలు నియమిచారు” అని ఆరోపించారు.