ఇండిగో విమనానికి తృటిలో ముప్పు తప్పింది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో వున్న సమయంలో ఒక్క సారిగా వడగండ్ల వాన పడింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతిన్నది.
ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం సురక్షితంగా దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వడగళ్ల వానకు విమాన ముందు భాగం దెబ్బతినిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆ సమయంలో పైలట్ చాకచక్యంగా విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంపై ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇది ఇలా వుంటే గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.