ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. శ్రీవారి ప్రసాదంలో ఈసారి వెంట్రుకలు, దారాలు దర్శనం ఇచ్చాయి. హైదరాబాద్ మల్కాజ్ గిరికి చెందిన ఓ భక్తుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డుప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. స్వామి వారి ప్రసాదంను తింటున్న సమయంలో వెంట్రుకలు, దారాలు కనిపించాయి. అది చూసి అవాక్కయిన భక్తుడు స్వామి వారి ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా స్వామి వారి ప్రసాదంలో మేకులు, ఇతర వస్తువులు వచ్చిన సంఘటనలు ఉన్నప్పటికీ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఇంకా అలాగే ఉంది.