సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కి ఉరిశిక్ష ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు హాజిపూర్ సర్పంచ్ కవిత. పై న్యాయస్థానాల కు వెళ్లకుండా ఎవ్వరూ సపోర్ట్ చెయ్యకూడదని కోరారు. మా గ్రామంలో కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. హజీపూర్ గ్రామంలో బిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. హజీపూర్ గ్రామంలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజిట్ చేయాలని కోరారు. బాధిత కుటుంబాలు చాలా నిరుపేద కుటుంబానికి చెందినవారు. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కవిత కోరారు.