ప్రభుత్వం ఒక్కొక్కరి విషయంలో ఒక్కొలా వ్యవహరిస్తుందని మండిపడుతున్నాయి హాజిపూర్ బాధిత కుటుంబాలు. దిశ నిందితుల మాదిరిగానే హాజిపూర్ ఘటనలో పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఘటన వెలుగులోకి వచ్చి ఎనిమిది నెలలైనా… విచారణ పేరుతో తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ అయినా చేయాలి, ఉరైనా తీయాలి అని హాజిపూర్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే శ్రీనివాస్ రెడ్డిని తమకు అప్పగిస్తే… తామే శిక్షిస్తామంటూ ఆందోళనకు దిగారు.
దిశ తల్లితండ్రుల మాదిరిగా తమది కూడా కడుపు కోతే కదా… మరి తమ పిల్లల ఆత్మ కొంతైనా శాంతించాలి కదా… అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే శ్రీనివాస్ రెడ్డిని చంపెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ కొడుకులను ఇలా చంపగలరా…?