దిశకు జరిగిన న్యాయమే… తమ విషయంలోనూ జరిగాలంటూ హాజీపూర్ బాధితులు గవర్నర్ తమిళిసైని కలిశారు. హజీపూర్‌లో బాలికలపై శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలు వెలుగులోకి రావటంతో… ఆయన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపించింది. ప్రస్తుతం విచారణ ఖైదీగా వరంగల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి విచారణ నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో మరో వారంలో పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుందన్నది ఆసక్తిగా మారింది.
అయితే… దిశ అత్యాచారం కేసులో సత్వర న్యాయం జరిగిన నేపథ్యంలో, శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష పడితేనే తమకు న్యాయం జరుగుతుందని హాజీపూర్ గ్రామస్తులంటున్నారు.