ఇస్లామిక్ విధానాలలో ఉన్న కొన్ని పద్ధతులు వారికే కొన్నిసార్లు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా ‘హలాలా’ పేరుతో మాజీ భార్యను స్నేహితుడికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నించిన (AIMIM) కార్యదర్శిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే… ఉత్తర ప్రదేశ్‌లోని అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లింమీన్ (AIMIM) కార్యదర్శి రియాజుద్దీన్ తన భార్యకు 9 ఏళ్ల క్రితమే విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు స్నేహితుడిని తీసుకొచ్చి వివాహం చేసుకుంటానంటూ ఆమెను వేధించాడు.
ఎఫ్ఐఆర్ ప్రకారం తన బిడ్డతో పాటు జామియా నగర్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళ 2012లో రియాజుద్దీన్ విడాకులు తీసుకున్నాను అని నమ్మబలికి ఆమెను రెండవ వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తరువాత ట్రిపుల్ తలాక్ చెప్పి ఆమెతో విడిపోయాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత ఆమె దగ్గరకు తన స్నేహితుడితో ‘హలాలా’ చేయించడానికి ప్రయత్నించినందుకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది బాధితురాలు. అతను ఆమెపై బలవంతంగా అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించాడు. గొడవ ఎక్కువవడంతో ఇరుగు పొరుగువారు దీనికి సాక్ష్యమయ్యారు. అతను తన రాజకీయ పటిమను ఉపయోగించి తనను హత్య చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది.
మరోవైపు నిందితుడు తాను వారం రోజుల ముందు రాజకీయాల నుంచి తప్పుకున్నానని, ఆ మహిళ తన నుంచి డబ్బు డిమాండ్ చేసిందని, డబ్బు వసూలు చేయడానికి తనపై తప్పుడు కేసులు పెట్టిందని పేర్కొన్నాడు.ఇక ‘హలాలా’ అంటే ఇస్లామిక్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చాక ఆమెనే మళ్ళీ వివాహం చేసుకోలేరు. భార్య ఇంకొకరిని వివాహం చేసుకుని, వారితో ఒకరాత్రి గడిపి, వారికి విడాకులు ఇచ్చాకే మొదటి భర్త పెళ్ళి చేసుకోవచ్చు.