టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న బ్యూటీ హంసా నందిని. మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆమె అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది హంసా నందిని.
టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం అందరికి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో క్యాన్సర్ బారిన పడినట్టు ప్రకటించిన ఆమె.. చాలా బాధను అనుభవించింది. అప్పటి నుంచీ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. చివరకు క్యాన్సర్ ను జయించింది.
ట్రీట్మెంట్ తో పాటు ఆత్మవిశ్వసం తోడై… క్యాన్సర్ ను విజయవంతంగా అధిగమించిన హంసా నందిని తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే ఆమెకు వంశపారంపర్యంగా ఆమె బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. 2021 డిసెంబర్ లో విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది హంస.
నైన్ సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నానని, మరో 7 సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు వెల్లడించింది. బుధవారం తిరిగి ఓ సినిమా షూటింగ్ కు హాజరైన హంసానందిని.. అదే రోజు తన పుట్టిన రోజు కావడంతో.. సందడి చేసింది. అంతే కాదు తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్ డేట్ కూడా ఇచ్చింది బ్యూటీ.
దీనికి సబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది హంసా నందిని.మూవీ సెట్లో ఉంటే మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు. ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. నేను తిరిగి వచ్చేశా అని హంసా పోస్ట్ పెట్టింది.
హంస నందిని తల్లి కూడా క్యాన్సర్ తోనే మరణించింది. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకుుంది. 18 ఏళ్ల క్రితం తన తల్లిని కేన్సర్ పొట్టన పెట్టుకుందంటూ ప్రకటించిన హంసా.. ధైర్యంగా క్యాన్సర్ తో పోరాటం చేసింది.