క్యాన్సర్ బారినపడిన నటి హంసానందిని తగిన చికిత్స తీసుకుంటూ కోలుకుంటోంది. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి ఇన్ స్టాలో ఓ అప్ డేట్ ఇచ్చింది. 16 సైకిల్స్ కీమో థెరపీ చేశారని వివరించింది.
తనకు చికిత్స ఇంకా పూర్తి కాలేదని.. అయితే.. ఇప్పుడు అధికారికంగా కోలుకున్నానని స్పష్టం చేసింది. ఇది తర్వాతి పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం అంటూ.. సర్జరీలకు సమయం ఆసన్నమైందని తెలిపింది. గుండుతో ఉన్న రెండు ఫోటోలను షేర్ చేసింది హంసానందిని.
ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజన్లు, అభిమానులు ఆ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. సేఫ్ గా తిరిగొచ్చి మునపటిలా ఉంటారని ధైర్యం చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది హంసానందిని. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
తన తల్లి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో మరణించారని వంశపారంపర్యంగా తనకు కూడా వచ్చిందని పేర్కొంది హంస. ప్రస్తుతం తాను కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నానని త్వరలోనే క్యాన్సర్ ను జయిస్తానని తెలిపింది. ఈక్రమంలోనే 16 సైకిల్స్ కీమో థెరపీ పూర్తయింది.