చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు కలకలం రేగింది. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంటేశ్వర స్వామి ఆలయంలో చెన్నైకు చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమతిలేని పూజలను నిర్వహించారు. అమావాస్య కావడంతో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో అనధికారికంగా పూజలు నిర్వహించటం చూసిన స్థానికులు భయాందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పూజలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ సహకరించాడని పోలీసులకు ఆ ఐదుగురు వ్యక్తులు విచారణలో నిజం చెప్పటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో కాళహస్తి టెంపుల్ ఏఈఓ ధనపాల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.