దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ హన్సిక. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంత పెద్ద విజయాలను సాధించలేకపోయింది. అయితే లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినీ అభిమానులు వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. దీంతో చాలా మంది హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ లిస్ట్ లో తమన్నా, కాజల్, సమంత నిత్యమీనన్ చేరగా వీరి జాబితాలో హన్సిక కూడా చేరింది.
Advertisements
ఈ వెబ్ సిరీస్ ను పిల్లజమీందార్, భాగమతి చిత్రాల దర్శకుడు అశోక్ తెరకెక్కించారు. త్వరలోనే ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ కు నషా అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ వెబ్ సిరీస్ లో పది ఎపిసోడ్స్ ఉంటాయి. తెలుగు తమిళ భాషలలో స్క్రీమ్ కానుంది.