ఇద్దరు నటీనటులు కాస్త క్లోజ్ గా ఉంటే గాలివార్తలు పుట్టుకు రావడం సహజం.ఇంది నిజమో అబద్ధమో రాసేవాళ్లకు వదిలేస్తే వినేవాళ్లకు దీంతో నిమిత్తం లేదు. అయితే నిప్పులేకుండా పొగరాదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం.
రీసెంట్‌గా నటి హన్సిక మోత్వానీ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో తనను ఓ స్టార్ హీరో టార్చర్ పెట్టాడని, డేట్‌కు వస్తావా అంటూ వేధించాడని, కానీ తాను అతనికి తగిన రీతిలో బుద్ధి చెప్పి పంపించానంటూ ఓ ఇంటర్వ్యూలో హన్సిక చెప్పిందని ఆ వార్త సారాంశం.
అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని హన్సిక ఖండించింది. తొలుత ఓ వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్ స్క్రీన్‌షాట్ షేర్ చేసి.. తానసలు క్యాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలే చేయలేదని, ఇలాంటి చెత్త వార్తలు రాయడం ఆపండంటూ కోపంగా రియాక్ట్ అయ్యింది.
అనంతరం మరో ట్వీట్‌లో.. ‘‘ఏదైనా ఒక వార్త రాసేముందు, అందులో నిజానిజాలేంటో తెలుసుకుని రాయాల్సిందిగా కోరుతున్నాను. గుడ్డిగా ఏది పడితే అది రాయొద్దు. ఇప్పుడు ఏ వార్తైతే చక్కర్లు కొడుతోందో, అలాంటి వ్యాఖ్యలు నేనెప్పుడూ చేయలేదు’’ అంటూ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో ఇంత మంది ఉండగా అనని మాటలు పనిగట్టుకుని రాయడం ఎవరు రాస్తారన్నది ఆమె బేరీజు వేసుకోవాలి.
కాగా.. దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హన్సిక, తొలి చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపు ఆకర్షించి, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో ఎందరో స్టార్ హీరోలతో జోడీ కట్టింది.
కానీ, గ్లామర్ ప్రపంచంలో ఇతర కథానాయికల నుంచి పోటీ తీవ్రం కావడంతో, హన్సికకు క్రమంగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. సినీ పరిశ్రమలో తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేసింది కానీ, అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే హన్సిక గతేడాది తాను ప్రేమించిన వ్యక్తి సోహెల్ ఖతూరియాని పెళ్లి చేసుకుని, వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది.
Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that's doing the rounds pls fact check before publishing blindly .
— Hansika (@ihansika) May 23, 2023