తన పెళ్ళి గురించి షాకింగ్ నిజంలు బయటకు వెల్లడించింది హీరోయిన్ హన్సిక. గతేడాది వివాహబంధంతో ఇల్లాలిగా మారిన ఈబ్యూటీ.. తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలలో క్లారిటీ ఇచ్చింది. తన భర్త గతం గురించి తనకు ముందే తెలుసంటోంది ఈ భామ. తన భర్తకు ఇంతకు ముందే పెళ్ళి జరిగిందని.. అయితే ఆమెకు విడాకులు ఇచ్చిన తరువాతే తనను పెళ్ళాడానంటోంది. అయితే సోషల్ మీడియాలో జరుతున్న ప్రచారం ప్రకారం.. తన భర్త విడాకులకు మాత్రం తాను కారణం కాదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
తన పెళ్ళి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది హన్సిక. లవ్ షాదీ డ్రామా పేరుతో.. హన్సిక వెడ్డింగ్ వీడియో డిస్నీ ప్లస్ హట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా హన్సికా మాట్లాడుతూ.. నేను కూడా గతంలో ఒకరితో రిలేషన్ లో ఉన్నాను. ఆ విషయం మీకు తెలుసు. కానీ ఈసారి బయటకు వస్తే.. నా భర్తతోనే రావాలి అనుకున్నాను. విమర్శించే ఛాన్స్ ఇవ్వొద్దు అని ఫిక్స్ అయ్యానంటోంది హన్సిక.
ఇక తన భర్త సోహెల్ తన జీవితంలోకి వచ్చిన క్షణాలు మాత్రం తనకు చాలా ప్రత్యేకం అంటోంది బ్యూటీ. గత ఏడాది డిసెంబర్ లో వివాహజీవితంలోకి అడుగు పెట్టింది హన్సిక. డిసెంబర్ 4న తన స్నేహితుడు,ప్రియుడు సోహెల్ తో ఏడడుగులు నడిచింది. అయితే అసలు సోహెల్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు..? వారి పరిచయం ఎలా జరిగింది..? పెళ్ళిదాకా వారి ప్రయాణం గురించి లవ్ షాదీ డ్రామా లో వివరించింది హన్సిక.
హన్సిక మాట్లాడుతూ.. పెళ్ళి గురించి రహస్యంగా ఉంచాలి అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే పెళ్ళి గురించి వార్తలు వైరల్ అయ్యాయి. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. పైగా సోహెల్ గురించి .. తన విడాకులకు నేను కారణం అంటూ వస్తున్న వార్తలు గురించి విని చాలా ప్రెజర్ ఫీల్ అయ్యాను.. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు అమ్మ ఓ సలహా ఇచ్చింది అన్నారు హన్సిక.
అమ్మసలహా మేరకు మాపెళ్ళి గురించి అనౌన్స్ చేశాను. సోహెల్ నాకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాను. దాంతో అందరూ విష్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ అప్పుడే అసలు సమస్య స్టార్ట్ అయ్యింది. సోహెల్ గతంలో పెళ్ళి గురించి డిస్కర్షన్ మొదలయ్యింది. హన్సిక మాట్లాడుతూ.. పెళ్ళి గురించి అనౌన్స్ చేసిన తరువాత షూటింగ్ కోసం చెన్నై వెళ్ళాను. ఆ టైమ్ లో.. నేను గతంలో సోహెల్ పెళ్ళికి వెళ్ళిన ఫోటోను వైరల్ చేసి.. వారి విడాకులకు నేనే కారణం అన్నారు. అది నన్ను ఎంతో బాధించింది. వారు విడిపోవడానికి నేను కారణం కాదు. సోహెల్ గతం గురించి నాకు ముందే తెలుసు అన్నారు హన్సిక.
ఇక పెళ్లి తరువాత హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుంది బ్యూటీ. కెరీర్ ను ఆపేయకుండా.. కంటీన్యూ చేస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా హాట్ డోస్ ఇంకా పెంచి మరీ ఫోటోస్ ను అప్ లోడ్ చేస్తోంది హన్సిక.