చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత దేశ ముదురు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన అందాల ముద్దు గుమ్ము హన్సిక. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ కొట్టి తరువాత వెనక్కితిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరియర్ లో ఏకంగా 50కి పైగా చిత్రాలలో నటించింది.
మొదటిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తరువాత కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ సూపర్ హిట్ అయ్యింది. తమిళ్ ఆడియన్స్ కలలరాణి అయిపొయింది. అయితే కెరియర్ మంచి పీక్ లో ఉండగానే శింబుతో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటల వరకు వెళ్లిన హన్సిక ఎందుకనో తరువాత అతనికి బ్రేక్ అప్ చెప్పింది.
ఇక శింబుతో విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా కూడా ఆమె అలా స్లో అయ్యింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ నుంచి మెల్లగా క్రిందికి వచ్చేసింది. అయితే అవకాశాలు మాత్రం తగ్గలేదు. సోలో హీరోయిన్ గా ఫీమేల్ సెంట్రిక్ కథలతో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ వచ్చింది. రీసెంట్ గా మహా అనే సినిమాతో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే హన్సిక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.గత కొంతకాలంలో ఓ వ్యక్తితో ఆమె రిలేషన్ లో ఉందని, ఇప్పుడు అతనితో పెళ్ళికి రెడీ అవుతుందని టాక్. ఇక డిసెంబర్ లో ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఆమె ఓ మీడియా సంస్థతో పంచుకుంది.
రాజస్థాన్ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోటలో అంగరంగ వైభంగా వివాహం జరగనుందని తెలిపింది. ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో గ్రాండ్ గా జరగబోతుందని తెలియజేసింది. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక బయటకు చెప్పలేదు.