నాయిని రాజేందర్ రెడ్డి.. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు
ల్యాండ్ పూలింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు తీరని నష్టం చేస్తోంది. రైతుల భూములు రాజ్యాంగ బద్దంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రైతులు తమ పూర్వికుల నుండి సాగు చేసుకుంటున్నా భూములను కోల్పోతున్నారు.
ల్యాండ్ పూలింగ్ జీవో ఎందుకు రద్దు చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, రాష్ట్ర ప్రజలకు సమాదానం చెప్పాలి. భూములు ఇవ్వడానికి రైతులెవరు ముందుకురావడం లేదు. అయినా రైతులను భయపెట్టి తమ భూములను లాక్కునే ప్రయత్న చేస్తున్నారు.
24 గంటల్లో ల్యాండ్ పూలింగ్ జీవోను వెనక్కి తీసుకోకపోతే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ప్రభుత్వం రైతులకు అన్యాయం జరిగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తెలంగాణలో ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని భూములను ఆక్రమించుకోవడానికే పదవులు చేపట్టారు.
Advertisements
రాష్ట్రంలో ఉన్నది ఎమ్మెల్యేలు కాదు.. ల్యాండ్ బ్రోకర్లు. రైతుల పక్షాన పోరాటం చేస్తే మా నాయకులను అరెస్ట్ చేస్తారా..? కార్మికుల నాయకున్నీ జైల్లో పెట్టిన నువ్వు కార్మిక నాయకునివా వినయ్ భాస్కర్. మంత్రి మల్లారెడ్డికి తగిన శాస్తి జరిగింది. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు. ఈ ఘటనే టీఆర్ఎస్ ప్రభుత్వ పథనానికి పునాది వేస్తోంది.