డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అ, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇక ఈ పోస్టర్ లో ఒక దట్టమైన అడవిలో చెట్టుపై స్లింగ్ షూట్ తో గురి పెట్టి నిలుచున్నాడు తేజ.
అలాగే గడ్డం మీసం లాంగ్ హెయిర్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా…ఈ పోస్టర్ తో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.