యంగ్ హీరో తేజ సజ్జ జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి హనుమాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
అయితే సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం వరలక్ష్మి శరత్‌కుమార్ పుట్టినరోజు కావటంతో మేకర్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఆ లుక్ లో వరలక్ష్మి పెళ్లి దుస్తుల్లో కొబ్బరికాయలు పట్టుకుని ఆవేశంగా కనిపించింది. ఇందులో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి నటిస్తుంది.
అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డినిర్మిస్తున్నారు.