కొన్ని కాంబినేషన్‌లు మాత్రమే ప్రాజెక్ట్‌లపై భారీ హైప్‌ని తీసుకొస్తాయి. అందులో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా కెరీర్ ఆరంభంలో ఉన్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబి రెడ్డి చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు వీరు భారతీయ సూపర్ హీరో చిత్రం హను-మాన్ సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తుంది.
ఇక గతంలో వచ్చిన జాంబి రెడ్డి హిందీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయింది. అక్కడ ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. దీనితో హను-మాన్ హిందీ హక్కులు 5 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఈ చిత్రం యొక్క తెలుగు శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ గ్రూప్ 11 కోట్లకు తీసుకున్నారు.
హిందీ డబ్బింగ్, తెలుగు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం 16 కోట్ల రూపాయల బిసినెస్ చేయటం అంటే ఈ యంగ్ హీరోలు మంచి స్టార్టింగ్ అనే చెప్పాలి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అమృత అయ్యర్ తేజ సజ్జా సరసన నటిస్తుంది.