అటు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే సినిమా సెట్స్ మీద చురుకుగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే కమిటైన అన్ని సినిమాలను చకచకా ఫినిష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నారు. విభిన్నమైన చారిత్రక అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు క్రిష్. రీసెంట్ గా వదిలిన ఫస్ట్ గ్లాన్స్ వీడియో హరిహర వీరమల్లు సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ కానున్నాయట. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే ఫిబ్రవరి 4 ఏఎం రత్నం పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ చెబుతూ హరిహర వీరమల్లు సెట్స్‌పై తీసిన కొన్ని ఫొటోస్ షేర్ చేసింది చిత్రయూనిట్.ఈ ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ గెటప్ చూసి ఫిదా అవుతున్నారు మెగా ఫ్యాన్స్. త్వరగా ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే షూటింగ్ దశలోనే భారీ డిమాండ్ చేకూరడంతో దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం రిలీజ్ కి ముందే రావొచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ చేసే సినిమా ఇదే అవుతుందని అంటున్ మరోవైపు హరిహర వీరమల్లు మూవీ హక్కుల కోసం బయ్యర్స్ ఇప్పటినుంచే పోటీ పడుతున్నారట. క్రిష్- పవన్ కళ్యాణ్ కాంబో కావడంతో ఈ సినిమా ఎలాగైనా లాభాలు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో భారీ ఆఫర్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ భారీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత దిగ్గజం కీరవాణి బాణీలు కడుతున్నారు
ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. ఇది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని ఆశ పడుతున్నారు పవన్ అభిమానులు. అందుకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట క్రిష్.