డ్రీమ్ గర్ల్ హేమా మాలిని 74 వసంతంలోకి అడుగు పెట్టారు. 1948లో శ్రీరంగంలో ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయలక్ష్మీ, చక్రవర్తి ఐయ్యంగార్. 15ఏండ్ల ప్రాయంలోనే ఆమె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
1963లో ‘ఇదు సతియమ్’అనే తమిళ సినిమాతో డ్రీమ్ గర్ల్ తెరంగేట్రం చేశారు. ఇక అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత స్టార్ యాక్టర్ ధర్మేంద్రతో ఆమె ప్రేమలో పడ్డారు. 1980లో ధర్మేంద్రను ఆమె వివాహం చేసుకున్నారు.
వారికి కూతుర్లు ఇషా డియోల్, అహనా డియోల్ లు జన్మించారు. సినీ రంగానికి ఆమె ఎన్నో సేవలు చేశారు. ఆమె భారత చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను గతేడాది 52వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా భారత ప్రభుత్వం ఆమెకు ఇండియన్ ఫిల్మ్ పర్స్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డుతో గౌరవించింది.
ఇప్పటికీ ఆమె బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ఆమె గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె మహేష్ కౌల్ దర్శకత్వంలో వచ్చిన సప్నోకి సౌధాగర్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జానీ మేరా నామ్, సత్తేపే సత్తా, షోలే, భగ్ వాన్ లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించారు.