నాగచైతన్యతో విడాకుల తర్వాత వరుసబెట్టి సినిమాలు చేస్తోంది సమంత. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తెలుగులో ఆమె చేసిన ‘శాకుంతలం’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. దీనికి గుణశేఖర్ దర్శకుడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.
సమంత పుట్టినరోజు సందర్భంగా ‘శాకుంతలం’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘శకుంతల’ పాత్రలో సమంత చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు.
ఇటు తెలుగులో ‘యశోద’ అనే సినిమా కూడా చేస్తోంది సమంత. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ సరసన కూడా ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.
సామ్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు స్పెషల్ విషెస్ చెప్పారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా ప్రత్యేక పోస్టర్లతో విష్ చేశారు.