సూర్యాపేట జిల్లాలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కుటుంబ సభ్యులతో పరిచయమున్న వ్యక్తే ఈ దుస్సాహసానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఇంటి వెనక ఉండే ఇంటిలో నివాసముండే ఓ మహిళ అందించిన సమాచారంతో పోలీసులు ఈజీగా కేసును చేధించారు.
మరోవైపు కిడ్నాపర్ల బెదిరింపులకు భయపడి ఇప్పటికే బాలుడి తండ్రి వారికి రూ.7లక్షలు పంపించారు. కాగా కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు ఓ ప్రభుత్వ ఉద్యోగి అని తెలుస్తోంది. సాయం కోసం మరో ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత బాలుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ముందని పోలీసులు చెప్పుకుంటున్నారు.