పాటిదార్ సామాజిక వర్గానికి చెందిన నేత, గుజరాత్ కాంగ్రెస్ మాజీ నాయకుడు హార్దిక్ పటేల్ బీజేపీలో చేరనున్నారు. జూన్ 2న ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
ఆయన బీజేపీలో చేరతారని సోమవారం కూడా వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు.
తాను సోమవారం బీజేపీలో చేరడం లేదని, అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా మీకు తెలియజేస్తాను అని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే మరుసటి రోజే హార్దిక్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా అయోధ్య ఆలయంపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు.