మునుగోడు ఉప ఎన్నికల గురించి టీఆర్ఎస్ మంత్రి హారీష్ రావు ధ్వజమెత్తారు. ఈ ఉప ఎన్నిక కావాలని బీజేపీ తెచ్చి పెట్టిన ఉప ఎన్నిక అంటూ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన ఉప ఎన్నికలో గెలవాలని చూస్తోందంటూ విమర్శించారు.
ఒక్కో నేతకు ఒక్కో రేటు చెల్లించి కొనుగోలు పర్వానికి తెర లేపింది బీజేపీయేనని వెల్లడించారు. నేతలకు, కార్యకర్తలకు ఇవ్వడానికి బీజేపీ 200 బ్రిజా కార్లు, 2 వేల మోటార్ బైక్ లు బుక్ చేసినట్లు ఇప్పటికే సమాచారం అందిందని తెలిపారు.టీఆర్ ఎస్ కార్యకర్తలు బీజేపీ వారి మీద నిరంతరం నిఘా పెట్టారన్నారు. ఆఖరికి వారు ఎక్కడెక్కడ బుక్ చేశారో కూడా మా దగ్గర సమాచారం ఉందన్నారు. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలవాలా లేక రాజగోపాల్ రెడ్డి ధనం గెలవాలో ఆలోచించుకోవాలన్నారు.
ఈ 8 సంవత్సరాలలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది మునుగోడు ప్రజల కళ్ల ముందు ఉంది అని ఆయన పేర్కొన్నారు. కేవలం 15 వేల కాంట్రాక్టు కోసం రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికకు తెరతీశారని విమర్శించారు. తెలంగాణలో చేస్తున్న చాలా పనులకు కేంద్రమే అవార్డులు ఇస్తున్న పరిస్థితి ఉంది అని వివరించారు.బీజేపీ కి చెప్పుకోవడానికి ఏం లేక దిక్కుమాలిన దిగజారిన రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. అమ్ముడు తప్ప బీజేపీ కి ఏం తెలియదని పేర్కొన్నారు. రైళ్లు, విమానాశ్రయాలు అన్నిటినీ అమ్మేస్తున్నారు. 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని నింపరు అంటూ విమర్శించారు. ఇప్పటికే రూపాయి విలువ దిగజార్చారు. సైన్యం లో కేంద్రం కాంట్రాక్టు పద్దతి తెచ్చిందని తెలిపారు.
మేము చేసినవి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి.బీజేపీ కి ఏం లేకనే క్షుద్ర విద్యలు, మూఢ నమ్మకాలు అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు అంటూ పేర్కొన్నారు. ఆ విద్యలన్నీ బీజేపీకే తెలుసున్నన్నారు.
మునుగోడు లో టీ ఆర్ ఎస్ గెలుస్తుందని మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
కేంద్ర మంత్రి సీతారామన్ కూడా ఆధారాలు లేకుండా దివాళా కోరు తనం తో మాట్లాడుతున్నారు. మంత్ర తంత్రాల తో మేము అధికారం లో రాలేదన్నారు. ప్రజా ఉద్యమాల తో అధికారం లో వచ్చామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వారణాసి హిందు విశ్వ విద్యాలయం లో భూత వైద్యం కోర్సు ప్రారంభించింది. ఈ కోర్సు కు 50 వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించారని తెలిపారు.
బండి సంజయ్ ఈ కోర్సు లో చేరితే మంచిది. నల్ల పిల్లులు ,చేతబడులు, నిమ్మకాయలు, మిరపకాయలు ఇవన్నీ బీజేపీ కే తెలుసని విమర్శించారు. బీజేపీ దగ్గర అభివృద్ధి గురించి చెప్పడానికి ఏం లేదు కనుకే ఇవన్నీ మాట్లాడుతున్నారన్నారు. సీతారామన్ ఆయుష్మాన్ భారత్, కాళేశ్వరం పై గతం లోనే నాలుక కరచు కున్నారు. రూపాయి విలువ దిగజార్చిన సీతారామన్ ఇపుడు రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. నిర్మల గారు మాకు తెలిసింది తాంత్రిక్ విద్య కాదు లోక్ తాంత్రిక్ విద్య మాత్రమే అంటూ పేర్కొన్నారు.
నీళ్లు, నిధులు నియామకాల్లో టీఆర్ ఎస్ విఫలం అనే హక్కు సీతారామన్ కు ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. కేంద్రమే కదా పంట కొనలేమని చేతులెత్తేసింది.. ఇది సీతారామన్‌కు కనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు. 8 ఏళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాల పై మేము శ్వేత పత్రం విడుదల చేస్తాం.. కేంద్ర ఉద్యోగాల పై మీరు ప్రకటిస్తారా అంటూ సవాల్ చేశారు.
తప్పుడు ప్రకటనలు చేస్తే బీజేపీ ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మనసు గెలవలేదని తెలిపారు.
ఉట్టి కి ఎగురనమ్మా స్వర్గానికి ఎగిరినట్టుంది అని బీఆర్ ఎస్ గురించి సీతారామన్ వ్యంగ్యం గా మాట్లాడారుమేము తెలంగాణ సాధించి ఉట్టికి ఎగిరాం.. ఇపుడు దేశ వ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలు చేసేందుకు బీఆర్ ఎస్ పెట్టామని స్పష్టం చేశారు.టీఆర్ ఎస్ పెట్టినప్పుడు కూడా ఏవేవో విమర్శలు చేశారు. చివరికి విమర్శలు చేసిన వారే అలసిపోయారు తప్ప మేమేమి వెనక్కి తగ్గలేదన్నారు. ఇప్పుడు కూడా అంతే. వందే భారత్ ఎక్స్ ప్రెస్ బర్రెలు అడ్డం వస్తేనే ముక్కలు అయిపోయింది. ఆ ఎక్స్ ప్రెస్ లా నిర్మలా డొక్కు మాటలు మాట్లాడొద్దు.
రాజగోపాల్ రెడ్డి మోటార్లు ఇప్పిస్తున్నారు.మోటర్లకు లొంగితే రేపు మీటర్లు పెడతారు అంటూ పేర్కొన్నారు. మోటార్లు కావాలా మీటర్లు కావాలా తెల్చుకోవాలంటూ ప్రజలనుద్దేశించి ఆయన అన్నారు.
బీజేపీ చెప్పేవి నీతులు.. తవ్వేవి గోతులంటూ విమర్శించారు.బీజేపీ మునుగోడు లో చేసే అరాచకాల పై నిఘా పెడతాం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉప ఎన్నికలు తెచ్చి బీజేపీ ప్రజా ధనాన్ని వృథా చేస్తోందన్నారు. మునుగోడుతో పాటు హర్యానాలో కూడా బీజేపీ కృతిమ ఎన్నిక తెచ్చిందంటూ పేర్కొన్నారు.