పవన్ కళ్యాణ్ టాలీవుడ్ క్రేజియెస్ట్ హీరో..ప్రస్తుతం ఓ రాజకీయపార్టీ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు అతని చూపు తమపై పడితే చాలు జన్మధన్యం అనుకునే ఫ్యాన్స్ ను సంపాదించుకున్న టాలీవుడ్ హీరో.
ఏక కాలంలో డబుల్ ట్రాక్స్ రన్ చేస్తున్న హీరోల్లో పవన్ ఒకరు. చేతినిండా సినిమాలున్నా సమయమే లేదు అన్నట్టుగా తయారయ్యింది పవన్ పరిస్థితి.
ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్ లో కూడా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ‘ఓజీ’ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
కాస్త టైమ్ ఇస్తే చాలు ఇదేపవన్ అనుకూల పవనం అన్నట్టుగా షూటింగ్ పెట్టకుంటున్నారు మేకర్స్.ఇటీవల విడుదల చేసిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ గ్లింప్స్ కు భారీ స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హరిహరవీరమల్లు’ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తాజా షెడ్యూల్ వాయిదా పడిన విషయం తెలిసిందే.
జూన్ మొదటివారం నుంచి ‘హరిహరవీరమల్లు’ సినిమా కోసం పవన్‌కల్యాణ్ డేట్స్ కేటాయించారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం.
మొఘల్ కాలం నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్ అన్యాయాలపై తిరగబడే బందిపోటు పాత్రలో కనిపించనున్నారు.