చాన్నాళ్లుగా పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత వరకు వచ్చింది? దీనిపై నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చాడు.
నిర్మాత చెప్పిన ప్రకారం, హరిహరవీరమల్లు సినిమా 60శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇందులో 2 పాటలు కూడా ఉన్నాయి. మిగతా 40శాతం షూటింగ్ ను మే నెల చివరి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు 60శాతం పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది. గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తవుతోంది. దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
సినిమాకు సంబంధించి ఇంకా నాన్-థియేట్రికల్, థియేట్రికల్ బిజినెస్ మొదలుపెట్టలేదు. కేవలం ఆడియోను మాత్రం టిప్స్ కు ఇచ్చారు. నెక్ట్స్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బిజినెస్ మొదలుపెడతారట.
పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పీరియాడిక్ ఫిక్షన్ సినిమాలో విలన్ గా బాబిడియోల్ నటిస్తున్నాడు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.