ఒకప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు… పది రూపాయల కోసం మర్డర్ చేసిన నేర చరిత్ర అన్నది. ఇప్పుడు అమ్మాయి కోసం మిత్రుడిని అత్యంత దారుణంగా మర్డర్ చేశాడు తమ్ముడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ మర్డర్ కేసులో నిందితుడు హరిహర కృష్ణ బ్యాక్ గ్రౌండ్.
వరంగల్ జిల్లాకు చెందిన హరిహర కృష్ణ తండ్రి ఎర్ఎంపీ డాక్టర్. హరిహర అన్న ముఖేష్ ది అంతా నేర చరిత్రే. అల్లరి చిల్లరగా తిరిగే.. ఇతని పై అనేక కేసులుండడంతో.. స్థానికంగా రౌడీషీట్ ను కూడా పోలీసులు ఓపెన్ చేయడం జరిగింది. అయితే 2010లో.. అడిగితే కేవలం పది రూపాయలు ఇవ్వలేదని ముఖేష్ వరంగల్ కీర్తి బార్ ముందు మర్డర్ చేశాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉండడంతో అతను ఐదేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక ఇదే నేరచరిత్ర తీవ్ర ప్రభావం హరిహర పై పడినట్టు తెలుస్తోంది. అందుకే అమ్మాయి కోసం స్నేహితుడని కూడా చూడకుండా నవీన్ ను అంత కిరాతుకంగా మర్డర్ చేశాడు. అంతటితో ఆగని అతడు.. నవీన్ డెడ్ బాడీ నుంచి ఒక్కోక్క శరీర భాగాన్ని బయటికి తీసి.. వాటి పిక్స్ కూడా అమ్మాయి ఫోన్ కు పంపించి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఇలా ఉంటే.. హరిహర ఆరోగ్య పరిస్థితి బాలేదని…అతడు సైకో లా బిహేవ్ చేసేవాడని కూడా అంటున్నారు.