పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.
ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయింది. మిగిలిన షూటింగ్ కరోనా పరిస్థితిలో సద్దుమణిగాక స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే ఈ సినిమా కోసం లుక్ చేంజ్ చేసుకునే పనిలో పవన్ పడ్డట్లు తెలుస్తుంది. ఇదిగో లా కనిపించిన పవన్ కూడా లాంగ్ హెయిర్ తో కనిపించాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కనుక ఇందులో మీసం, పొడుగాటి జుత్తు తో పవన్ కనిపించబోతున్నాడు.
ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక దీంతోపాటు భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తోంది. గతంలో హరీష్, పవన్ గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.